హలో అమ్మా....
అమ్మా హలో హలో...
నిన్నే అమ్మా హలో..
అటు కాదు ఇటు...
పైకి చూడమ్మా నేనూ ...
నీ చిన్నారి పసికందునమ్మా...
స్వర్గం నుంచి మాట్లాడుతున్నా...
హలో అమ్మ నేనిక్కడ బావున్నా...
చాలా బాగున్నా...
ఇదిగో రంగు రంగుల
సువాసనలు వెదజల్లే పూలూ...
రకరకాల పక్షుల,,,
కిలకిలా రావాలూ...
పచ్చని తివాచీల్లాంటి ఆటస్తలాలూ....
వీనులకింపైన సంగీతం
ఎటు చూసినా
సీతాకోక చిలుకలూ....
పళ్ళూ పూలూ
గలగలపారే సెలయేళ్ళూ...
అటు ఇటు చెంగున దూకే లేళ్ళూ.
పురివిప్పి ఆడే నెమళ్ళూ...
అల్లదిగో ఆకాశాన హరివిల్లూ...
అయినా,,,
హలో అమ్మా...
నువ్వే గుర్తొస్తున్నావమ్మా.... నిజమమ్మా..
నువ్వెలా ఉన్నావమ్మా...
నిజంగా నువ్వెలా ఉన్నవో కూడా
సరిగ్గా గుర్తు లేదమ్మా...
నా కళ్ళు పూర్తిగా తెరుచుకోకముందే
మూసేసావు కాదమ్మా...
ఎలా నిన్ను చూసేది....
నాకొక
అన్నయ్య ఉన్నాడు కదమ్మా...
వాడితోనే
ఆడుతూ పాడుతూ
ఉన్నావు కదమ్మా ..
బాగా గుర్తొస్తూన్నావమ్మా...
నవమాసాలు మోసి
నన్ను చూడగానే
నలిపేసావు కాదమ్మా....
ఇంత పసిదాన్ని...
నీకు బరువెలా అయ్యానమ్మా...??
మసక మసగ్గా
నిన్ను చుసేలోగానే
నన్ను
చెత్త బుట్ట పాలుచేసావు కదామ్మా
ఎంచక్కా అన్నయ్యకు నీకు
ఆటబొమ్మలా అయ్యేదాన్ని కదమ్మా...
నా మీదే నీకెందుకమ్మా కోపం..
హలో హలో అమ్మా..
ఆ దేవుడు
నాకు రాసి పెట్టిన
తిండే తినేదాన్ని కాదమ్మా...
హలో అమ్మా..
అమ్మా..
అయినా నీమీద నాకు కోపం అస్సలు లేదమ్మా....
ఇక్కడ అన్నీ ఉన్నా
నువ్వే కావాలమ్మా...
హలో అమ్మా
ఏడవకు ...
అమ్మా ఏదో ఒకరోజు
నువ్వూ
ఇక్కడి కొస్తావుగా
అప్పుడు నిన్ను
కళ్ళారా చూస్తా..
ఒకే ప్రశ్న అడుగుతా.....
హలో అమ్మా హలో
"స్వర్గం కంటే మిన్నయిన
నీ వడిలోచి
అప్పుడే నన్నెందుకిక్కడికి
పంపావమ్మా ""
హలో హలో అమ్మా..
లవ్ యూ అమ్మా..
హలో
హలో ....
హలో ....
అమ్మా.........
( the number you are trying to call is put you on hold please wait for sometime or call later)
ఆ పసిబిడ్డ వేదన వర్ణనాతీతంగా ఉంది జానీగారు,నిజంగా అటువంటి తల్లి ఇది చదివితే ఎంత కుమిలిపోతుందో.....
ReplyDeleteథాంక్యూ శ్రీదేవిగారు
Deleteమీ కవితలో తండ్రి హృదయం కనిపిస్తుంది,
ReplyDeleteసున్నిత హృదయం మాత్రమే ఆ పసికూన బాదను చెప్పగలదు,
జానీ,అభినందనలు మీ కవితకు
థాంక్స్ దీదీ
Deleteమీ స్పందనలో తడియారని
తల్లి కన్నీటి స్పర్శ తగిలింది నాకు
ఓ అమ్మ ఓ బిడ్డ మధ్య ఎలాంటి బంధం పెనవేసుకుని ఉంటుందో, తన ప్రతిరూపాన్ని తలుచుకుని మురిసిపోయే ప్రతి తల్లి చదవాల్సిన లెటర్ ఇది. చాలా చక్కగా వర్ణించారు జాని గారు. అమ్మ హృదయం చాల గొప్పది. ఆ పసికందు మనసు ఎంతో గొప్పది. కన్న పెగుని ఎలా వదిలించుకొవాలా అని కొంత మంది చేసే హడావిడి, కన్నా బిడ్డను మన కన్నా బాగా సాకాలి అని కొంత మంది పడే తాపత్రాయాన్ని కళ్ళకు కట్టినట్టు రాసినారు. మీ జన్మ సార్థకం అయ్యింది, మంచి కథను అందించారు
ReplyDeleteమీ ఆప్యాయతకు అభినందనకూ
Deleteకృతజ్ఞ్యతలు నాయక్ గారు