జీవిత మెప్పుడూ పూలబాట కాదు
అలాగని ముళ్ళ బాటా కాదు
దానికి పొడవూ వెడల్పు లోతూ ఉంటాయి
ఏ కష్టమూ లేకుండా
జీవితపు పరిమాణ మెప్పుడూ తెలియదు అలా జీవించే వారికది అతి స్వల్పమే
కష్టాలనూ అడ్డంకులనూ
ఎదుర్కొని
లక్ష్యాలను ఏర్పరచుకుని
నిరంతరం శ్రమించేవారికే
జీవితపు వివిధ దశలలోని
ఆనందాల్ని ఆస్వాదించే అవకాశముంటుంది
జీవితాన్ని పూర్తిగా జీవించడమంటే ఇదే.
బాగుందండీ...
ReplyDeleteమీ అమూల్యమైన స్పందనకు
Deleteఅభివాదములు,
ప్రసాదరావు గారు..
పూలబాటలో నడిచేటప్పుడు పూలను చూస్తూ పరవశించినట్లే, ముళ్ళబాటలో నడిచేటప్పుడు మెలకువతో ముళ్ళను జాగ్రత్తగా తొలగించుకోగలిగితే సహనంతో ...జీవితాంతం జీవంతో కూడిన నవ్వులతో జీవించగలం .జానీగారు చాలా బాగుంది మీ రచన.
ReplyDeleteథాంక్స్ శ్రీదేవి గారు
Deleteజీవితం అంటే ఓ తెరిచిన పుస్తకం, అందులో ప్రతి పేజీ మనదైన శైలి(జీవనవిదానం) ఉంటుంది,ఓర్పూ,సహనం, చాలా అరుదైన అంశాలు విలువైన పాఠాలు కూడా,
ReplyDeleteమీ రచన చాలా బాగుంది(నాకు తెలుసు చిత్రకారునికి అక్షర అవసరం ఎంతుంటుందో.) అభినందనలు జానీ,
హహ చిత్రాలు గీసే చేతులతో
Deleteచిన్నగా రాసే ప్రయత్నమూ ఇప్పుడిప్పుడే చేస్తున్నా దీదీ
అదీ కూడా మీ చలవే
జానీ,సెట్టింగ్స్ లోకి వెళ్ళి "వర్డ్ వెరిప్ఫికేషన్" తీసెయ్యి కామెంట్ పెట్టటం కస్టంగా ఉంది.
ReplyDeleteఅవునా దీదీ
Deleteసరే సిస్టంలో చేసి చూస్తా