ఆ కళ్ళు బదులడుగుతున్నాయ్
తమను ప్రశ్నగా
మిగిల్చారెందుకని..
ఆకళ్ళు ఆక్రోశిస్తున్నాయ్
ఆకళ్ళ చూపులతో
ఆడుకుంటారెందుకని..
ఆ కళ్ళు మండుతున్నాయ్
చల్లని గుండెకు
చలిమంటవేసేదెందుకని
అయినా
ఆ కళ్ళు కరుణనేచూపుతున్నాయ్
ఆ కళ్ళు
చల్లని ప్రేమను చల్లే
బంగారు తల్లివని..
Thursday, 27 March 2014
ఆ కళ్ళు .
Tuesday, 25 March 2014
తల్లీ,నెచ్చెలీ .
అమ్మవు నువ్వు
నీ చిట్టి రె మ్మకు కొమ్మవు నువ్వు
అలసినపుడు అక్కునచేర్చుకునే
ఆధారం నువ్వు .
**************
తల్లివి నీవు
నా బంగరు తల్లివి నీవు
నన్ను లతలా అల్లుకునే
తీవెవి నీవు .
తల్లీ బిడ్డలమైనా
కన్నీళ్ళ కథ ఒక్కటే మాది
వర్ణ.
సప్త వర్ణవు నీవు
సతత హరితవు నీవు
సకల వర్ణ సమ్మిళిత
శ్వేత మేధవు నీవు
జీవ ధాత్రివి నీవు
సహన ధరిత్రివి నీవు
మహిళవు నీవు
మహిలోదేవతవు నీవు
Monday, 24 March 2014
చిరుదీపాలు
ఈ చిన్నారి చిరుదీపాన్ని
చిదిమిందెవ్వరో...
ఈ చిరునవ్వుల్ని,
చీల్చి చెండాడిందెవ్వరో..
పశు ప్రవృత్తితో పట్టపగ్గాల్లేని,
శిశుపాలుర,,
నూరు తప్పులుదాటినా
నోరు మెదపని సమాజం
కళ్ళు తెరిచేదెన్నడో..
Sunday, 23 March 2014
షహీద్ దివస్.
ఉగ్గు పాలైనా మరవని వయసులో
జీవితాల్ని మాత్రు భూమి కోసం
ఉరికోయ్యల్ని ముద్దాడటానికి
ఉసిగొల్పిన భారతావని
యువ వీర కిశోరాలు
సుఖదేవ్ , భగత్ సింగ్ , రాజ్ గురు .
23 మార్చి ....
అమరవీరుల స్మరణ దినం .
Wednesday, 19 March 2014
Monday, 17 March 2014
హలో అమ్మా ..
హలో అమ్మా....
అమ్మా హలో హలో...
నిన్నే అమ్మా హలో..
అటు కాదు ఇటు...
పైకి చూడమ్మా నేనూ ...
నీ చిన్నారి పసికందునమ్మా...
స్వర్గం నుంచి మాట్లాడుతున్నా...
హలో అమ్మ నేనిక్కడ బావున్నా...
చాలా బాగున్నా...
ఇదిగో రంగు రంగుల
సువాసనలు వెదజల్లే పూలూ...
రకరకాల పక్షుల,,,
కిలకిలా రావాలూ...
పచ్చని తివాచీల్లాంటి ఆటస్తలాలూ....
వీనులకింపైన సంగీతం
ఎటు చూసినా
సీతాకోక చిలుకలూ....
పళ్ళూ పూలూ
గలగలపారే సెలయేళ్ళూ...
అటు ఇటు చెంగున దూకే లేళ్ళూ.
పురివిప్పి ఆడే నెమళ్ళూ...
అల్లదిగో ఆకాశాన హరివిల్లూ...
అయినా,,,
హలో అమ్మా...
నువ్వే గుర్తొస్తున్నావమ్మా.... నిజమమ్మా..
నువ్వెలా ఉన్నావమ్మా...
నిజంగా నువ్వెలా ఉన్నవో కూడా
సరిగ్గా గుర్తు లేదమ్మా...
నా కళ్ళు పూర్తిగా తెరుచుకోకముందే
మూసేసావు కాదమ్మా...
ఎలా నిన్ను చూసేది....
నాకొక
అన్నయ్య ఉన్నాడు కదమ్మా...
వాడితోనే
ఆడుతూ పాడుతూ
ఉన్నావు కదమ్మా ..
బాగా గుర్తొస్తూన్నావమ్మా...
నవమాసాలు మోసి
నన్ను చూడగానే
నలిపేసావు కాదమ్మా....
ఇంత పసిదాన్ని...
నీకు బరువెలా అయ్యానమ్మా...??
మసక మసగ్గా
నిన్ను చుసేలోగానే
నన్ను
చెత్త బుట్ట పాలుచేసావు కదామ్మా
ఎంచక్కా అన్నయ్యకు నీకు
ఆటబొమ్మలా అయ్యేదాన్ని కదమ్మా...
నా మీదే నీకెందుకమ్మా కోపం..
హలో హలో అమ్మా..
ఆ దేవుడు
నాకు రాసి పెట్టిన
తిండే తినేదాన్ని కాదమ్మా...
హలో అమ్మా..
అమ్మా..
అయినా నీమీద నాకు కోపం అస్సలు లేదమ్మా....
ఇక్కడ అన్నీ ఉన్నా
నువ్వే కావాలమ్మా...
హలో అమ్మా
ఏడవకు ...
అమ్మా ఏదో ఒకరోజు
నువ్వూ
ఇక్కడి కొస్తావుగా
అప్పుడు నిన్ను
కళ్ళారా చూస్తా..
ఒకే ప్రశ్న అడుగుతా.....
హలో అమ్మా హలో
"స్వర్గం కంటే మిన్నయిన
నీ వడిలోచి
అప్పుడే నన్నెందుకిక్కడికి
పంపావమ్మా ""
హలో హలో అమ్మా..
లవ్ యూ అమ్మా..
హలో
హలో ....
హలో ....
అమ్మా.........
( the number you are trying to call is put you on hold please wait for sometime or call later)
Friday, 14 March 2014
కార్ల్ మార్క్స్
కార్ల్ మార్క్స్
సామాజిక విప్లవవేత్త
కార్మిక ఉద్యమానికి
మార్గ దర్శకుడు
పీడిత తాడిత
బడుగు బలహీన వర్గాల
విముక్తికి పాటుపడిన
మానవతావాది
( నేడు 131 వ వర్ధంతి )
Tuesday, 11 March 2014
జీవించండి, జీవితాంతం..
జీవిత మెప్పుడూ పూలబాట కాదు
అలాగని ముళ్ళ బాటా కాదు
దానికి పొడవూ వెడల్పు లోతూ ఉంటాయి
ఏ కష్టమూ లేకుండా
జీవితపు పరిమాణ మెప్పుడూ తెలియదు అలా జీవించే వారికది అతి స్వల్పమే
కష్టాలనూ అడ్డంకులనూ
ఎదుర్కొని
లక్ష్యాలను ఏర్పరచుకుని
నిరంతరం శ్రమించేవారికే
జీవితపు వివిధ దశలలోని
ఆనందాల్ని ఆస్వాదించే అవకాశముంటుంది
జీవితాన్ని పూర్తిగా జీవించడమంటే ఇదే.
