Thursday, 27 March 2014

ఆ కళ్ళు .

ఆ కళ్ళు బదులడుగుతున్నాయ్
తమను ప్రశ్నగా
మిగిల్చారెందుకని..
ఆకళ్ళు ఆక్రోశిస్తున్నాయ్
ఆకళ్ళ చూపులతో
ఆడుకుంటారెందుకని..
ఆ కళ్ళు మండుతున్నాయ్
చల్లని గుండెకు
చలిమంటవేసేదెందుకని
అయినా
ఆ కళ్ళు కరుణనేచూపుతున్నాయ్
ఆ కళ్ళు
చల్లని ప్రేమను చల్లే
బంగారు తల్లివని.. 

Tuesday, 25 March 2014

తల్లీ,నెచ్చెలీ .

అమ్మవు నువ్వు
నీ చిట్టి రె మ్మకు కొమ్మవు నువ్వు
అలసినపుడు అక్కునచేర్చుకునే 
ఆధారం నువ్వు .
**************
తల్లివి నీవు
నా బంగరు తల్లివి నీవు
నన్ను లతలా అల్లుకునే
తీవెవి నీవు .
తల్లీ బిడ్డలమైనా
కన్నీళ్ళ కథ ఒక్కటే మాది

వర్ణ.

సప్త వర్ణవు నీవు
సతత హరితవు నీవు
సకల వర్ణ సమ్మిళిత
శ్వేత మేధవు నీవు
జీవ ధాత్రివి నీవు
సహన ధరిత్రివి నీవు
మహిళవు నీవు
మహిలోదేవతవు నీవు

Monday, 24 March 2014

చిరుదీపాలు

ఈ చిన్నారి చిరుదీపాన్ని
చిదిమిందెవ్వరో...
ఈ చిరునవ్వుల్ని,
చీల్చి చెండాడిందెవ్వరో..
పశు ప్రవృత్తితో పట్టపగ్గాల్లేని,
శిశుపాలుర,,
నూరు తప్పులుదాటినా
నోరు మెదపని సమాజం
కళ్ళు తెరిచేదెన్నడో..


తీపి ఓటమి

తన బిడ్డ చేతిలో ఓడిపోయినపుడు కలిగే విజయోత్సాహం ఆ తండ్రికి ఇంకేం సాధించినా దొరకదు .

Sunday, 23 March 2014

షహీద్ దివస్.

ఉగ్గు పాలైనా మరవని వయసులో
జీవితాల్ని మాత్రు భూమి కోసం
ఉరికోయ్యల్ని ముద్దాడటానికి
ఉసిగొల్పిన భారతావని
యువ వీర కిశోరాలు
సుఖదేవ్ , భగత్ సింగ్ , రాజ్ గురు .
23 మార్చి ....
అమరవీరుల స్మరణ దినం .

Wednesday, 19 March 2014

పుత్తడి బొమ్మ

పుత్తడి బొమ్మనే నేను
పూర్ణమ్మను చెయ్యొద్దు నన్ను