పుట్టి పెరిగే మొదలు చదివిఎదిగేదాక కన్నవారు కాయాన్ని
కష్టాలు పాల్జేసి చేతికందొస్తాడని చిల్లిగవ్వను దాచక పస్తులుండి
తల్లి పుస్తెలమ్మి ..
బస్తీ నుండి వచ్చి దర్జాగ కారులో వొదిలేస్తే మమ్మల్ని వోల్డేజి హోములో .
ఈ చేతులేన్నడూ దీవించేవే కాని
గోరంత కోపాన్ని చూపవేనాడూ .
కనుచూపు మేర కనిపించునత
కన్న కొడుకుని చూసి కళ్ళ నిండా .
చల్లంగ ఉండాలి కొడుకా నువ్వు
మెల్లంగ వెళ్లురా కొడుకా .
No comments:
Post a Comment