Sunday, 6 April 2014

పసి మొగ్గలు

కళ్ళల్లో పాలుగారే
పచ్చని పసిడి పసితనం
బుగ్గల్లో దోబూచులాడే అమాయకత్వం
వాత్సల్యపు వరద పొంగే
చిట్టి చేతులు
కరకు పాషాణపు చూపుల
ఇనుప వలల్లో చిక్కి
మకిల మహిషపు
మద హస్తాల మధ్య
చివురుటాకులా నలుగుతూ
చిదిమి వేయబడుతున్నాయి
జరిగేదేంటో తెలీని
లేత జీవితాలు
నాలుగ్గోడల్లోనలిగిపోతున్నాయి

రండి.....
మన కంటి పాపల్ని
ఓ కంట కనిపెడదాం
మొగ్గల్లోనే వాడకుండా
ఈ రేపటి పుష్పాల్ని
మన పూదోటల్లో
స్వేచ్చగా పుష్పించనిద్దాం.. 

( April...the child abuse awareness month.) 

3 comments:

  1. మూసిన ఆ చేతులకు సంకెళ్ళు వేసే చిత్రాన్ని వేసిన బంగారు చేతులకు సలాం.

    ReplyDelete
  2. ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసం కలిగించడంతో పాటు నిరంతరం మన కనుసన్నలలో మెలిగే ఆడపిల్లలందరిని మనం కూడా కాచుకుని ఉండాలి....... జానీగారు మీ చిత్రం చాలా సజీవంగా ఉంది.

    ReplyDelete
  3. థాంక్స్ దీదీ
    మరియు శ్రీదేవిగారు

    ReplyDelete