Sunday, 27 April 2014

అభిసారిక

కలలు కన్న
రాకుమారుడు
మనసుపడ్డ
మానసచోరుడు
కనుచూపు మేరలో
కాంచినంతనే
పాదాలాగాక
పదాలందక
కళ్ళు తెరిచి
వొళ్ళు మరిచి
యెదవోపని
ఎడమాపని
తుళ్ళింతల్లో
ఎగిరిపడి ఎదురేగి
ఒదిగిపోయే
అభిసారికా!!
నీ కలలు పండేనిక..


3 comments:

  1. ఇక ఇంత జరిగాక కలలు పండకపోతే ఎలా అధ్యక్షా !
    చిత్రాభిసారిక కడు రమణీయముగానున్నది.

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలను ఆశీస్సులుగా గైకొని
      ఆనందమెల్లె డలా వ్యాపింప మిన్నంటిన మిక్కిలి మోదం తో ముందుకు పోతామని తెలియ చేస్తున్నం శ్రీదేవిగారూ

      Delete
  2. ఈ చిత్రాన్ని మనస్సు పెట్టి వేశారు అని తెలుస్తుంది, అభినందనలు జానీ.

    ReplyDelete