Thursday, 3 April 2014

నా ప్రియ బాంధవి ..

నా జీవంలో జవం నింపి
నా కలలనూ కలతలనూ
కళ్ళలో దోపుకుని 
నా కన్నీళ్లు దోచి
నా దోసిట విరిజల్లుల
మరు మల్లెల
మరోలోకానికి సహవాసియై
ఒదార్పియై
ఎడారిలో గోదారియై
నాదారిలో తన పాదాలు
నన్ను పద పదమని
ఎద రొదలకిక సెలవని
కలవని అనుకున్నా
కలని కాదుకలనని
కలువ రెక్కలు తొడిగి
మది చలువ పందిళ్ళు వేసి
వందేళ్ళూ నాబందీవై
బంధించిన
అనురాగ బంధమా
కలైనా నిజమైనా
నాకిదే జీవితం సుమా !!

1 comment:

  1. ఓ ప్రేమ పలవరింత కనిపిస్తుంది, ఓ సున్నిత భావం కనిపిస్తుంది,
    కలైనా,నిజమైనా నాకిదే జీవితం సుమా.. ఈ పదాలు కలచివేస్తున్నాయి.
    జానీ అభినందనలు, కాకుంటే మీ కవితకి మీ బొమ్మే ఉంటే సంపూర్ణం అవుతుంది.

    ReplyDelete