సర్వ కార్య
సర్వకాల
సక్రియాసంపన్నురాలు..
నిత్య శ్రామికురాలు
సత్యధార్మికురాలు
అతివేనయా.
ఇంటా బయటా
ఇంతగా తోడునిస్తున్నా,
ఇంతి ఇక్కట్లు
ఇంతింత కాదయా..
Monday, 28 April 2014
ఇంతి ఇంతే (నా ?)
Sunday, 27 April 2014
అభిసారిక
కలలు కన్న
రాకుమారుడు
మనసుపడ్డ
మానసచోరుడు
కనుచూపు మేరలో
కాంచినంతనే
పాదాలాగాక
పదాలందక
కళ్ళు తెరిచి
వొళ్ళు మరిచి
యెదవోపని
ఎడమాపని
తుళ్ళింతల్లో
ఎగిరిపడి ఎదురేగి
ఒదిగిపోయే
అభిసారికా!!
నీ కలలు పండేనిక..
Wednesday, 23 April 2014
నేను.
నాకు నేనుగా
నన్ను నేను ఒంటరినైన వేళా
నన్ను నానేనొదిలి
కనుమరుగైన వేళా..
జ్ఞ్యాపకాలు ఆక్రమించి
ఆత్మనీ అవశేషరహితగా చేసి
అస్తిత్వాన్ని మసకేసే వేళా.
స్పందనలకతీతంగా
అనుభావావషేశాల్ని
ఒక్కొక్కటిగా తొలుస్తూ
సజీవ నిర్జీవయై
ఒంటరిగా నేను..
Monday, 21 April 2014
చిరు దీపం
ముసిరిన చీకటి
కమ్ముతున్నా
నీ ఆలోచనల
ముసుగు కప్పి
జ్ఞ్యాపకాలకి
ఊపిరిలూదుతున్నా..
కనుమరుగైన
కడగంటి చూపుకి
హృదిలోని చిరుఆశ
మిణుగురులా
తడిసిన రెప్పల్ని
తడుముతోంది..
కదలని కాలం
కడలిలా ముంచుతున్నా
నీ కలల అలల్లో
కాయమింకా
తేలుతూనే ఉంది..
చిరు సవ్వడికీ
చిగురించే శ్వాస
ప్రతిసారీ మరుజన్మనిస్తోంది.
యెద తిమిరాన్ని
రోదపెడుతూ
మది తలపుల
తలుపు వాకిట్లో
చిరు దీపపు
హారతి వెలిగించి
ఎదురు చూస్తున్నా..
ఉదయం కోసం
హృదయం
పరుస్తున్నా...
Friday, 11 April 2014
పెగిలే (పగిలే) గొంతు.
మా గొంతుకలు
కోయిలకూ లేవంటారు
మా పలకరింపులకు
పులకరిస్తారు
మా గొంతుకతో పాడుకుంటారు
మా గొంతుకను వాడుకుంటారు
మీకోసం వాడితే
ప్రాణం లేచోస్తుందంటారు.
మాకోసం వాడితే
గొంతులేస్తుందంటారు..
మా గానానికి
మీ కాళ్ళు నర్తిస్తూనే
మా గొంతు పై
మీ వ్రేళ్ళూ నర్తిస్తుంటయ్..
నొక్కడానికి,,,.
అడుగుల్తో
అడుక్కి తొక్కడానికీ..
Wednesday, 9 April 2014
Tuesday, 8 April 2014
అమ్మ కడుపు.
కలల పంటవు నువ్వు,,
నా కడుపు పంటవు నువ్వు,,
కాళ్ళు అరిగించి,
నా కళ్ళు కరిగించి,
బతుకు నీడ్చె బండి
ఇరుసునవుతా,,
నా బుజ్జి కొండా!!
నీ బొజ్జకు నా కండకరిగిస్తా..