లేఖనమూ, చిత్రలేఖనమూ
చంటి పాప తన కంటి పాప తన వొళ్ళో తన కళ్ళెదుట వొళ్లు మరచి అపుడపుడూ ముసి ముసిగా నవ్వుతూ పిడికిలి మెత్తగా తెరుస్తూ మూస్తూ నిద్రలోనే అమ్మతో మాట్లాడుతున్నాడా అన్నట్లు పెదాలు కదుపుతూఉంటే అమ్మ తాదాత్మ్యతకు అంతుందా..