నీలి కన్నుల్లో,
దాగున్న సంద్రం.
గుండె లోతుల్లో,
పొంగే తరంగం.
అల్ప పీడనమైనా,
అధికపీడనమైనా,
ఓ మైనా
నీ మది
వేయి సునామీల
నిశ్చల నది..
Monday, 26 May 2014
నిశ్చల సునామీ
Monday, 12 May 2014
తాదాత్మ్యత
చంటి పాప
తన కంటి పాప
తన వొళ్ళో
తన కళ్ళెదుట
వొళ్లు మరచి
అపుడపుడూ
ముసి ముసిగా నవ్వుతూ
పిడికిలి మెత్తగా
తెరుస్తూ మూస్తూ
నిద్రలోనే అమ్మతో
మాట్లాడుతున్నాడా అన్నట్లు
పెదాలు కదుపుతూఉంటే
అమ్మ తాదాత్మ్యతకు
అంతుందా..
Subscribe to:
Comments (Atom)